Drugs : శ్రీగంధం తోటల్లో...మత్తు పదార్థాల తయారీ - prakasam-district crime
16:23 July 02
ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్‌ఈబీ అధికారుల సంయుక్త దాడులు
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కె.అన్నసముద్రం గ్రామ సమీపంలోని 20 ఎకరాలు లీజు(lease)కు తీసుకుని శ్రీగంధం తోటలు వేశారు. తోట మధ్యలో రేకుల షెడ్ నిర్మించి ఓ పరిశ్రమను స్థాపించారు. ఈ షెడ్లో మత్తుమందు(drugs) తయారు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా సెబ్(seb) అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత గుంటూరు ఎస్‌ఈబీ అధికారి చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈ తనిఖీలో నిషేధ వస్తువులను వినియోగించి మత్తు పదార్థాలు తయారుచేస్తున్నట్లు గుర్తించారు. పౌడర్, మాత్రల రూపంలో ఉన్న మాదకద్రవ్యాలను స్వాధీనం(seise) చేసుకున్నారు. వీటి విలువ రూ. లక్షల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. పరీక్షల నిమిత్తం మత్తు పదార్థాలను ప్రయోగశాలకు(lab) పంపించారు. షెడ్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మత్తుపదార్థాల తయారీ నిర్వాహకుడు గతంలో తెలంగాణలోని రామచంద్రాపురం వద్ద ఇలాంటి యూనిట్ నిర్వహిస్తుండగా... పోలీసులకు పట్టుబడి ఆరెస్ట్(arrest) అయ్యాడు. దీంతో ప్రకాశం జిల్లాలో మత్తుపదార్థాల తయారీ కేంద్రాన్ని స్థాపించి అక్రమంగా మాదకద్రవ్యాలు తయారు చేస్తున్నట్లు సమాచారం.
ఇదీచదవండి.