ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కష్టం కరోనా రూపంలో ముంచుకొచ్చింది': కరివేపాకు సాగు రైతుల ఆవేదన - etv bharat latest updates

కరోనా ప్రభావంతో....కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్.....రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు తగిన ప్రతిఫలం లభించకపోవడంతో శ్రమ జీవులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో కరివేపాకును సాగు చేస్తున్న రైతుల కష్టాలు వర్ణణాతీతం.

Farmers' invocation at prakasam
'కష్టం కరోనా రూపంలో ముంచుకొచ్చింది': కరివేపాకు సాగు రైతుల ఆవేదన

By

Published : Jun 24, 2020, 9:04 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చల్లగిరిగల గ్రామంలోని రైతులు కరివేపాకును విస్తారంగా సాగు చేస్తున్నారు. ఈ పంటను స్థానికంగా ఉన్న కనిగిరి​తో పాటు, ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్​, తదితర మార్కెట్లకు తరలిస్తుంటారు. అయితే, కరోనా దెబ్బతో రవాణా స్తంభించిపోవడంతో కరివేపాకు రైతులకు నష్టాల తిప్పలు తప్పడం లేదు. ఎకరాకు రూ.40,000/- పెట్టుబడి పెట్టామని, తీరా పంట చేతికొచ్చే సమయంలో కష్టం కరోనా రూపంలో ముంచుకొచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం గిట్టుబాటు ధర కూడా రావట్లేదని శ్రమ జీవులు వాపోతున్నారు. లాక్​డౌన్​ వల్ల రవాణా స్తంభించిపోవటంతో కరివేపాకు తోటల్లోనే మగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

'కష్టం కరోనా రూపంలో ముంచుకొచ్చింది': కరివేపాకు సాగు రైతుల ఆవేదన

ABOUT THE AUTHOR

...view details