ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అధికారులు డ్రైనేజీలు నిర్మించడానికి పనులు మొదలుపెట్టి మధ్యలోనే ఆపేశారు. ముండ్లమూరు మండలం పెద్దఉల్లగల్లు గ్రామంలోని ఎస్సీకాలనీలో అంతర్గతరోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మించడానికి పనులు చేపట్టారు అధికారులు. కానీ పూర్తి కాలేదు. ఇంకోవైపు రోడ్లన్నీ అస్థవ్యస్తంగా ఉన్నా.. వాటిని పట్టించుకోవడం లేదు. రోడ్లు వేయమని నియోజకవర్గ నాయకులు, అధికారులతో ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల నిర్మాణం సగంలోనే ఆపేయడంతో.. మురుగు నీరు రోడ్లపై నిలిచి దుర్వాసన వస్తోందని చెప్తున్నారు. వర్షాలు కురిస్తే రోడ్లపై నీరు నిలిచి నడవడానికి వీలుండదని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమ కాలనీ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
అస్థవ్యస్తంగా డ్రైనేజీ నిర్మాణం
ఆ కాలనీలో రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. కానీ మధ్యలోనే వదిలేశారు. ఇక రహదారుల సంగతి చెప్పనక్కర్లేదు. అస్థవ్యస్తంగా ఉన్న రోడ్లతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
drainage problems