ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓపెన్ యూనివర్సిటీ ప్రశ్నాపత్రాలు చోరీ - Giddaluru news

గిద్దలూరు పట్టణంలోని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2019-2020 విద్యా సంవత్సరానికి చెందిన ప్రశ్నాపత్రాలను దుండగులు చోరీ చేశారు.

Dr. B.R. Ambedkar Open University questionnaires stolen
Dr. B.R. Ambedkar Open University questionnaires stolen

By

Published : May 5, 2021, 12:01 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2019-2020 విద్యా సంవత్సరానికి చెందిన ప్రశ్నాపత్రాల బండిల్(అందులో 1750 ప్రశ్నాపత్రములు)ను ఎత్తుకెళ్లారు. కొవిడ్ కారణంగా.. పరీక్షలు వాయిదా వేశారు. దీంతో కళాశాల చివరి రూమ్​లో పాతపుస్తకాలు, ఉపయోగం లేని పుస్తకాలు ఉంచిన గదిలో ప్రశ్నాపత్రాలను కూడా ఉంచారు. వీటితోపాటు దూరవిద్యకు సంబంధించిన స్టడీ మెటీరియల్స్ ను కూడా చోరీ చేశారు.. దుండగులు తీసుకెళ్లిన పరీక్ష పేపర్లు సెకండ్ సెమిస్టర్స్ కు సంబంధించినవి.

ABOUT THE AUTHOR

...view details