పన్నెండేళ్లు ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకున్న రైతన్నలకు ప్రభుత్వం 298 జీవోతో భరోసానిచ్చింది. బ్రిటిష్ కాలంనాటి 'చుక్కల భూముల' సమస్యకు చెక్‌పెట్టి త్వరగా పరిష్కరించాలని రెవిన్యూ శాఖను ఆదేశించింది. కాని కొందరు అధికారులు కర్షకుల వ్యథను విస్మరిస్తున్నారు. నెల్లూరు లాంటి జిల్లాల్లో అధికార యంత్రాంగం చుక్కల భూముల సమస్యలను 90 శాతం పూర్తి చేస్తుంటే...ప్రకాశం జిల్లా తహసీల్దార్లు నిర్లక్ష్యంతో రైతులను పట్టించుకోవట్లేదు. దిగువస్థాయి సిబ్బందికి ఈ విషయంపై పరిజ్ఞానం లేకపోవడమూ ఓ కారణమే. అదీ గాక 1930 నుంచి నమోదైన స్థలాలను సైతం చుక్కల భూములుగా పరిగణిస్తూ..అన్నదాతలకు చుక్కలు చూపిస్తున్నారు.
రైతులకు 'చుక్కలు' చూపిస్తున్నారు..!
పన్నెండేళ్లు ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకున్న రైతన్నలకు ప్రభుత్వం 298 జీవోతో భరోసానిచ్చింది. బ్రిటిష్ కాలంనాటి సమస్యకు చెక్‌పెట్టి.. త్వరగా 'చుక్కల భూముల'కు ఓ పరిష్కారం చూపాలని రెవిన్యూ శాఖను ఆదేశించింది. నిర్లక్ష్యం..అవగాహనలేమి కారణాలతో కొందరు అధికారులు కర్షకుల వ్యథను విస్మరిస్తున్నారు.
ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. ఆనందపురంలో 2500 ఎకరాలు వివాదాస్పద భూమిగా నమోదైంది. చుక్కల భూముల విషయంలో వచ్చిన 4214 ఆర్జీలను పరిశీలించగా సుమారు 3 వేలు తిరస్కరణకు గురయ్యాయి. పూర్తి ఆధారాలతో అధికారులను సంప్రదించినా..ఫలితం శూన్యమని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రెవిన్యూ సిబ్బంది ఎన్నికల పనుల్లో నిమగ్నమై తమను పట్టించుకోవటం లేదని రైతులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు చుక్కల భూముల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి...చుక్కల భూములకిదే పరిష్కారం