కరోనా నివారణ, సహాయ చర్యల కోసం సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు అందుతున్నాయి. ప్రకాశం జిల్లా పర్చూరు వైకాపా ఇంఛార్జీ రామనాథం బాబు రూ.కోటి రెండు లక్షలు, కనిగిరి ఎమ్మెల్యే రూ.కోటి, మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి రూ. 90 లక్షల చెక్కును ముఖ్యమంత్రి జగన్‌కు అందించారు.
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ - cm relief fund news today
కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు నేతలు భారీ మెత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రకటించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
![సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ donation for cm relief fund in prakasam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7060754-187-7060754-1588607860389.jpg)
ముఖ్యమంత్రికి చెక్కు అందజేస్తున్న దాతలు