తిరుమల ప్రసాదాన్ని, ఆస్తులను వ్యాపార దృష్టితో చూడటం సరికాదని డోలా బాలవీరాంజనేయస్వామి ఆక్షేపించారు. స్వామి వారికి భక్తులు ఇచ్చిన ఆస్తిని ఎలా వేలం వేస్తారని నిలదీశారు. శ్రీవారి భూములను అమ్మాలన్న నిర్ణయంతో లాభపడేది ఎవరని ప్రశ్నించారు. భక్తులా..? లేక తితిదేలోని అధికార పార్టీ బంధుగణమా..? అని దుయ్యబట్టారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ఆడుకోవడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే ఆస్తుల వేలం నిర్ణయాన్ని విరమించుకోవాలని డోలా బాలవీరాంజనేయస్వామి డిమాండ్ చేశారు.
'శ్రీవారి ఆస్తులు బంధువర్గాలకు కట్టబెట్టేందుకు కుట్ర' - వేలానికి తిరుమల ఆస్తులు తాజా వార్తలు
తితిదే ప్రతిష్ఠను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మసకబారుస్తోందని తెదేపా ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. విలువైన శ్రీవారి ఆస్తులను బంధువర్గాలకు కట్టబెట్టేందుకు కుట్రపన్నారని ఆయన ఆరోపించారు.
dola veeranjaneyaswamy on auction of ttd assets