ప్రకాశం జిల్లా నుంచి 170 కి.మీ దగ్గరలో ఉన్న రాజధానిని తీసుకుపోయి 550 కి.మీ దూరంలో ఉన్న విశాఖకు మార్చినందుకు ప్రకాశం జిల్లా వైకాపా నేతలు సంబరాలు జరుపుకొంటున్నారా..? అని..ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ప్రశ్నించారు. హైకోర్టును 350 కి.మీ దూరంలో ఉన్న కర్నూలుకు తరలిస్తునందుకు ప్రకాశం జిల్లా ప్రజలు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పెద్దలు కొంత మంది భూములు దోచుకునేందుకు వైజాగ్‌లో రాజధాని పేరుతో రాజకీయం చేస్తున్నారన్నారు. రాజధానిని జిల్లా ప్రజలకు అందనంత దూరం మార్చినందుకు పాలాభిషేకం చేశారా..? అని డోలా నిలదీశారు. ప్రకాశం జిల్లా ప్రయోజనాల కోసం ఈ ప్రాంత వాసులుగా మీరు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని పోరాటం చేయాలని ఎమ్మెల్యే కోరారు.
ప్రకాశం జిల్లా నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో?: డోలా - మూడు రాజధానులపై డోలా కామెంట్స్ వార్తలు
కుట్ర పూరితంగా వైజాగ్‌ను రాజధానిగా మారుస్తుంటే ప్రకాశం జిల్లా వైకాపా నాయకులు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో చెప్పాలని కొండెపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. రాజధానిగా వైజాగ్‌ను ఏర్పాటు చేస్తే ప్రకాశం జిల్లా వైకాపా నాయకులు జగన్ రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం చేయడం జిల్లా ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు.
dola veeranjaneeyaswamy comments on ysrcp leaders