మంత్రి ఆదిమూలపు సురేశ్.. తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని తెదేపా శాసనసభపక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. మంత్రి సురేశ్‌తో పాటు ఆయన భార్య విజయలక్ష్మీ అక్రమాస్తులు కలిగి ఉండి, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు స్పష్టం చేసినందున.. సురేశ్ దంపతులపై ముఖ్యమంత్రి సీబీఐ విచారణ జరిపించాలన్నారు. విద్యాశాఖ మంత్రిగా సురేశ్ ఇంకా పదవిలో కొనసాగితే విద్యార్థులు దారితప్పే ప్రమాదం ఉందన్నారు. అక్రమ ఆస్తులను సీబీఐ గతంలోనే నిర్థరిస్తే హైకోర్టులో స్టే తెచ్చుకున్నారని గుర్తు చేశారు.
'మంత్రి సురేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి' - tdp comments on minister adhimulpu suresh
మంత్రి ఆదిమూలపు సురేశ్ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని తెదేపా శాసనసభపక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. మంత్రి సురేశ్ అవినీతికి పాల్పడ్డారని.. సుప్రీం కూడా స్పష్టం చేసిందన్నారు. విద్యాశాఖ మంత్రిగా సురేష్ ఉంటే విద్యార్థులు దారితప్పుతారని ఆరోపించారు.
dola bala veeranjaneya swamy
రాష్ట్ర కేబినెట్లో సగం మంది మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. వైకాపా ప్రభుత్వాని రద్దుచేయాలన్నారు. మంత్రి సురేశ్‌కు అవినీతి, అక్రమార్జనపై ఉన్న శ్రద్ధ సొంత జిల్లా అభివృద్ధిపై ఏమాత్రం లేదని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: