ప్రకాశం జిల్లా చీరాలలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం బయటపడింది. పేరాలకు చెందిన కిరణ్మయి కాన్పుకోసం ఆస్పత్రికి వచ్చింది. గర్భిణీకి శస్త్రచికిత్స చేస్తామని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆస్పత్రిలో ఉంచుకున్నారు. సెలైన్లను ఎక్కించారు. సాయంత్రానికి తాము కాన్పు చేయలేమని.. ఒంగోలు రిమ్స్‌కు తీసుకెళ్లాలని చెప్పారు. రాత్రి 8 గంటల సమయంలో డాక్టర్లు వైద్యురాలు హడావిడిగా వెళ్లిపోయిందని.. డాక్టర్ల నిర్లక్ష్యానికి నిరసనగా బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. తరువాత చీరాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
గర్భిణీకి శస్త్ర చికిత్స చేస్తామన్నారు...కానీ ఆ తర్వాత..! - prakasam
చీరాలలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన కిరణ్మయి అనే మహిళను పట్టించుకోకుండా మరో ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు.
![గర్భిణీకి శస్త్ర చికిత్స చేస్తామన్నారు...కానీ ఆ తర్వాత..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4500859-133-4500859-1568994243450.jpg)
ఆసుపత్రి
Last Updated : Sep 20, 2019, 11:21 PM IST