ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో గాయాలు...ఆపై డెంగీ..చివరకు - ఒంగోలు వైద్యురాలు మృతి వార్తలు

విధుల నుంచి వస్తూ ఆ వైద్యురాలు విధికి బలయ్యారు. ఈ నెల 18న విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలులో చికిత్స అందిస్తుండగానే.. డెంగ్యూ బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో ఆమెను హైదరాబాద్ తరలించారు. సోమవారం ఆమె కన్నుమూశారు.

docter died in accident in ongole
docter died in accident in ongole

By

Published : Oct 27, 2021, 7:23 AM IST

విధుల నుంచి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రభుత్వ వైద్యురాలు తీవ్రంగా గాయపడ్డారు. అప్పటినుంచి మృత్యువుతో పోరాడుతూ చివరికి ఓడిపోయారు.

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కాజాకు చెందిన డా. తనూజాభాయి(38) ప్రభుత్వ వైద్యురాలిగా పని చేస్తున్నారు. తొలుత గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో విధులు నిర్వహించారు. గత మూడేళ్లుగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దంత వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ఒంగోలులో నివాసం ఉంటూ విధులకు హాజరవుతుంటారు. ఈ నెల 18న విధులు ముగించుకుని కారులో తిరిగి ఒంగోలు వస్తున్నారు. అదే సమయంలో తిరుపతి వెళ్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వైద్యురాలి వాహనాన్ని కనుమళ్ల జాతీయ రహదారి వద్ద వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఒంగోలులోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు.

వైద్యం అందిస్తుండగానే నాలుగు రోజుల క్రితం డెంగీ బారిన పడ్డారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆదివారం రాత్రి హైదరాబాద్‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె సోమవారం రాత్రి మృతి చెందారు. తనూజాభాయి భర్త కిరణ్‌ కుమార్‌ నాయక్‌ కూడా వైద్యునిగా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. వైద్యురాలి మృతికి స్థానిక వైద్యాధికారులు, సిబ్బంది నివాళి అర్పించారు.

ఇదీ చదవండి:

విషాదం... ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి

ABOUT THE AUTHOR

...view details