కార్తికమాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులు శివాలయాలకు భారీగా తరలివచ్చారు. ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని శివాలయాల్లో స్వామివారికి అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. సోపిరాలలోని శివాలయంలో తెల్లవారుజాము నుంచే శివదర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అలయ ప్రాంగణంలో ఉన్న జమ్మిచెట్టు వద్ద మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు. అయ్యప్పస్వామి దేవాలయంలో కార్తికమాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
పేరాలలోని పురాతన శ్రీ పునుగు రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో శివదర్శనం కోసం భక్తులు బారులు తీరారు. చీరాల శివాలయంలో గరళకంఠునికి అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారి దర్శనం చేసుకొనేలా ఆలయ పూజారులు ఏర్పాట్లు చేశారు.