సచివాలయ సేవలపై సమీక్ష నిర్వహించిన జిల్లా పంచాయతి అధికారి - Panchayat Officer conducted the review on yerragondapalem
ప్రకాశం జిల్లాలో సచివాలయాల ద్వారా వేగవంతంగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి జి. నారాయణరెడ్డి సచివాలయ అధికారులను ఆదేశించారు.
సచివాలయ సేవలపై సమీక్ష నిర్వహించిన జిల్లా పంచాయతి అధికారి
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం గ్రామ సచివాలయంలో ప్రజలకు అందిస్తున్న సేవలపై... సచివాలయ సిబ్బందితో జిల్లా పంచాయతీ అధికారి జి.నారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలో గ్రామ సచివాలయాల ద్వారా 524 రకాల సేవలను ప్రజలకు అందించడానికి, గ్రామ సచివాలయం ద్వారా 26 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలు అన్ని రకాల సేవలు పొందే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.