లాక్డౌన్ కారణంగా ప్రకాశం జిల్లా దర్శిలోని వ్యవసాయ కూలీలకు కనీస అవసరాలు కూడా తీరటం లేదు. ఈ మేరకు సీపీఎం పార్టీ, పట్టణంలోని వాసవి జ్యూయలరీ యజమాని కలిసి పేదలను ఆదుకోడానికి ముందుకు వచ్చారు. బియ్యం, కూరగాయలు, నూనె ప్యాకెట్లు పంపిణీ చేశారు. దర్శి డీఎస్పీ ప్రకాశరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వ్యవసాయ కూలీలకు దాతల అండ
లాక్డౌన్లో భాగంగా వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి అవస్థల్ని చూసిన దాతలు.. సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నిత్యావసరాలు పంపిణీ చేశారు.
Distribution of vegetables to agricultural laborers at darshi in prakasham district