ప్రకాశం జిల్లా మార్కాపురం యూనిట్లో ఉన్న మద్యం దుకాణాలు కంటైన్మెంట్ జోన్లో ఉండటంతో వాటిని 8వ తేదీ నుంచి తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మద్యం కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బుందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మద్యం ప్రియులకు టోకెన్లు పంచారు. మద్యం కొనుగోలు చేసే సమయంలో మాస్క్, గొడుగు నిబంధనను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. నిబంధనను పాటించని వారికి మద్యం విక్రయించమని తేల్చిచెప్పారు.
మద్యం ప్రియులకు టోకెన్లు పంపిణీ..! - ప్రకాశం జిల్లా వార్తలు
కొన్ని సడలింపులతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం యూనిట్లో ఉన్న దుకాణాలను 8వ తేదీ నుంచి తెరిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
మద్యం ప్రియులకు టోకెన్లు పంపిణీ