ప్రకాశంజిల్లా కనిగిరిలో జూనియర్ సివిల్ జడ్జి జి.గంగరాజు ఆధ్వర్యంలో ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇంట్లో నుంచి బయటికి రాకూడదని, అత్యవసర పరిస్థితులలో వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్కులు తొడుక్కోవాలని, భౌతిక దూరం పాటించాలని, బయటి నుంచి ఇంట్లోకి వెళ్లేటప్పుడు సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.
కనిగిరిలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ - corona
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనను కచ్చితంగా పాటించాలని ప్రకాశం జిల్లా కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి అన్నారు. ప్రజలందరూ ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కనిగిరిలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ