కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్తో ప్రజలు ఇళ్లకే పరిమితయ్యారు. ఈ నిబంధనతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవడానికి పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నాయిబ్రహ్మల సేవా సంఘం ఆద్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. స్థానిక ఎస్ఐ ముక్కంటి చేతుల మీదుగా బియ్యం, నూనె, కందిపప్పు తదితర 9 రకాల వస్తువులను అందజేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలన్నారు.
యర్రగొండపాలెంలో నిత్యావసరాల పంపిణీ - తదమక్దైల గల ోజ
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో రోజూ వారి పనులు చేసుకునే కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి తగిన సహాయం చేస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నాయి పలు స్వచ్ఛంద సంస్థలు. పేద ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇస్తూ బాసటగా నిలుస్తున్నాయి.
యర్రగొండపాలెంలో నిత్యావసరాల పంపిణీ