కరోనా నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీరాలలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులకు కొంతమంది దాతలు అండగా నిలిచారు. 140 మంది పేద చేనేత కుటుంబాలకు పది రోజులకు సరిపడా నిత్యావసరాలు పంపిణీ చేశారు. మరోవైపు జీవరక్షనగర్లోని యానాదులకు చెందిన 250 కుటుంబాలకు కూరగాయలు, కందిపప్పు, పంచదార అందజేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో పేదలకు సహాయాన్ని అందించినందుకు వైకాపా నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ దాతలను అభినందించారు.
చేనేత కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ - latest news on distribution of essential goods to weavers
లాక్డౌన్ దృష్ట్యా చీరాలలో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
చీరాలలో చేనేత కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ