నిత్యావసర సరకులు పంపిణీ చేసిన మంత్రి ఆదిమూలపు సురేశ్ - minster Distribution of essential commodities
ప్రభుత్వం ప్రకటించిని లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ పాటించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. దోర్నాలలో వైకాపా నాయకుల సహకారంతో ఆయన నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
![నిత్యావసర సరకులు పంపిణీ చేసిన మంత్రి ఆదిమూలపు సురేశ్ Distribution of essential commodities in dornas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6817179-379-6817179-1587040466322.jpg)
నిత్యావసర సరకులను పంపిణీ చేసిని మంత్రి అదిమూలపు సురేశ్
ప్రకాశం జిల్లా దోర్నాలలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి ప్రజలందరూ సామాజిక స్పృహతో సహకరించాలని మంత్రి అన్నారు. ప్రజల ఇబ్బందులను చూసి ప్రభుత్వం నెలలో మూడు సార్లు నిత్యావసర సరకులను అందించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలను అందిస్తోన్న రెవెన్యూ, పోలీస్, వైద్యారోగ్య, పారిశుద్ధ్య కార్మికులను మంత్రి అభినందించారు.