ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని 1638 పొదుపు గ్రూపులకు వైఎస్ఆర్ క్రాంతి పథకం ఆధ్వర్యంలో రూ. 11కోట్ల రూపాయల చెక్కు పంపిణీ చేశారు. వైకాపా నేతలను గుర్రపు బండి పై ఊరేగింపుగా సభాప్రాంగణం వరకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి మాట్లాడుతూ ...ఇచ్చిన మాట తప్పకుండా వాటిని అమలుచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే... అది మన సీఎం అని అన్నారు. నవరత్నాలను కూడా తూచా తప్పకుండా అమలు చేస్తారని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు.
దర్శిలో డ్వాక్రా గ్రూపులకు రూ.11కోట్ల చెక్కు పంపిణీ - దర్శిలో డ్వాక్రా గ్రూపులకు చెక్కుల పంపిణీ వార్తలు
ప్రకాశం జిల్లా దర్శిలో స్వయంసహాయక పొదుపు సంఘాలకు రూ.11కోట్ల రూపాయల చెక్కు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేమద్దిశెట్టి వేణుగోపాల్ లు పాల్గొన్నారు.
దర్శిలో డ్వాక్రా గ్రూపులకు చెక్కు పంపిణీ