మహిళా సాధికారతే లక్ష్యంగా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు చేపడుతున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని ఆర్డీటీ ఆడిటోరియంలో జరిగిన ఆసరా పథకం రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం(distribution of Asara scheme second installment checks)లో పాల్గొన్న ఆయన.. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. ఇచ్చిన మాటకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేపట్టిన పాదయాత్రలో.. మహిళలు, వివిధ వర్గాల ప్రజలు పడుతున్న కష్టాలను కళ్లారా చూసిన జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కోసం "నవరత్నాలు" పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు.
మహిళా సంక్షేమమే ధ్యేయం: విప్ రామచంద్రారెడ్డి
మహిళల సంక్షేమమే ధ్యేయంగా.. సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. మహిళా అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కనేకల్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రామచంద్రారెడ్డి.. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, ఏపీఐఐసీ మెట్టు గోవిందరెడ్డితో కలిసి రెండో విడత ఆసరా పథకం చెక్కుల పంపిణీ(Asara scheme second installment checks distribution at kanekal) కార్యక్రమాన్ని ప్రారంభించారు. కనేకల్ మండలంలోని 927 డ్వాక్రా సంఘాలకు రూ. 5.77 కోట్ల చెక్కును అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి..
devineni uma: ఆ ఒప్పందంతో.. రాష్ట్ర రైతుల గొంతు కోశారు: దేవినేని ఉమ