ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శంకవరంపాడులో బావి సమస్య..ఇరువర్గాల మధ్య వివాదం

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరం పాడులో ఓ బావి విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదానికి దారి తీసింది. అయితే ఓ వర్గానికి చెందిన కొందరు బావిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని మరో వర్గం వారు తెలిపారు.

శంకవరంపాడులో బావి విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం
శంకవరంపాడులో బావి విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం

By

Published : Jun 28, 2021, 2:03 PM IST



ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరంపాడులో ఓ మంచి నీటి బావి విషయం రెండు వర్గాల మధ్య వివాదానికి దారి తీసింది. 1950 సంవత్సరంలో లేబర్ వెల్ వారు ఏర్పాటు చెయ్యగా అప్పటినుంచి ఇప్పటివరకు ఓ వర్గం వారు ఉపయోగించుకుంటున్నారు. అయితే గత నెల నుంచి మరో సామాజిక వర్గానికి చెందిన కొందరు మంచినీటి బావి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. దానిని ఉపయోగించుకోవడానికి వీలులేకుండా చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నేడు కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి బి. రఘురాం, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకుని మంచినీటి బావి నుంచి నీటిని తోడారు. విషయం తెలుసుకున్న స్థానిక అద్దంకి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:
నెక్లెస్ రోడ్‌లో 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహం ఆవిష్కరణ

ABOUT THE AUTHOR

...view details