వందేళ్ల చరిత్ర కలిగిన ప్రకాశంజిల్లా వేటపాలెంలో 1929లో మహాత్మా గాంధీ శంకుస్థాపన చేసిన సారస్వత నికేతన్ గ్రంధాలయంలో ఉన్న పురాతన తాళపత్ర గ్రంథాలయంతో పాటు అమూల్యమైన పుస్తక సంపదను భావితరాలకు అందించే ఉద్ధేశ్యంతో వాటిని డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కొత్తపేటకు చెందిన సనాతన జీవన ట్రస్ట్ ఇందుకోసం ముందుకొచ్చింది.
జ్యోతిష్య, నవగ్రహ, వేదాంతం, శృంగార నైషధం, దేవీ మహాత్యం, కన్యకాపురాణం, రామాయణం, మహాభారతం వంటి నలభై గ్రంధాల్లోని నాలుగువేల పత్రాలను.. ఫ్రాన్స్ నుండి తెప్పించిన అధునాతన స్కానర్ ద్వారా డిజిటలైజేషన్ చేస్తున్నారు. ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ప్రముఖ నాడీ వైద్యుడి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.