ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గవ్యాప్తంగా పలు గ్రామాల్లో మిర్చి, కంది తదితర పంటలను సాగు చేశారు. పంటను అడవి పందులు నాశనం చేస్తున్నాయి. వాటి బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు వినూత్నంగా ఆలోచించారు. రంగు రంగు పాత చీరలను కొనుగోలు చేసి పొలాల చుట్టు కంచె కడుతున్నారు. ఒక్కో చీర 20 రూపాయలకు కొనుగోలు చేసి రక్షణ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. ఎకరాకు 50 నుంచి 70 వరకు చీరలు పడుతున్నాయని, రంగు రంగు చీరలు దూరం నుంచి చూసిన అడవి పందులు పొలాల వైపు రావడం లేదని రైతులు చెబుతున్నారు.
పంటకు రక్షణగా చీర... - పంటకు అమ్మ చీర తాజా వార్తలు
ప్రకాశం రైతులకు కొత్త ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఇప్పటివరకు వర్షాలు లేక, కరవుతో అల్లాడిపోయిన రైతు ఇప్పుడు పంటను కాపాడుకునేందుకు కష్టాలు పడుతున్నాడు. అడవి పందుల నుంచి పంటను రక్షించేందుకు కొత్త పద్దతులు కనిపెడుతున్నాడు.
పంటను నాశనం చేస్తున్న అడవి పందులు
TAGGED:
పంటకు అమ్మ చీర తాజా వార్తలు