కరోనా మహమ్మారిపై ప్రజల్ని చైతన్యపరిచేలా ప్రకాశం జిల్లా అద్దంకిలో వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. అందరి ఆరోగ్యం - మన అందరి బాధ్యత అంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో యమభటుల వేషధారణలో ప్రచారం నిర్వహించారు.
అద్దంకి పట్టణంలో ట్రాక్టర్‌పై తిరుగుతూ మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలంటూ చైతన్యపరిచారు. తప్పనిసరి పరిస్థితి ఉంటేనే ఇంటి నుంచి బయటికు రావాలంటూ పాటలు పాడుతూ అవగాహన కల్పించారు. ప్రజలు ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు.