ప్రకాశం జిల్లా కనిగిరిలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో స్థానికులు నిరసన చేశారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్తు చార్జీలను వెంటనే తగ్గించాలంటూ ప్లకార్డులు పట్టుకొని ఆయా పార్టీల కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు.
కరోనా నేపథ్యంలో పనుల్లేక, ఉపాధి కోల్పోయి అల్లాడుతుంటే.. విద్యుత్ ఛార్జీలను పెంచడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.