ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్ స్టేషన్​ ముందు వస్త్రా వ్యాపారుల ఆందోళన

తీసుకున్న వస్త్రాలకు చెల్లించాల్సిన నగదు అడిగినందుకు వస్త్రవ్యాపారిపై కేసు పెట్టింది ఓ అధికారిని. ఫిర్యాదు అందుకున్నదే తడవుగా ఆయన్ని పోలీసులు... స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించడం వివాదమైంది. ఆయనకు మద్దతుగా వ్యాపారులంతా రోడ్డెక్కారు.

వస్త్రా వ్యాపారుల ఆందోళణ

By

Published : Aug 28, 2019, 10:49 AM IST

చీరాల పోలీస్ స్టేషన్​ ముందు వస్త్ర వ్యాపారుల ఆందోళన

ప్రకాశంజిల్లా చీరాలలో మాధురి అనే మహిళ కొన్నేళ్ల క్రితం స్థానిక ఎంజీసీ మార్కెట్లోని ఓ దుకాణంలో వస్త్రాలు కొనుగోలు చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పని చేసే ఈమె తన పరపతి ఉపయోగించి... తర్వాత నగదు చెల్లిస్తానని చెప్పి వెళ్లిపోయింది. కాలం గడుస్తున్నా... నగదు చెల్లించకపోవడంతో... ఆమె పని చేసే కార్యాలయానికి వెళ్లాడు దుకాణ యజమాని లీలానంద్‌. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అడిగాడు. కార్యాలయానికి వచ్చి తన పనికి భంగం కలిగించాడని అతనిపై మాధురి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వస్త్ర వ్యాపారి లీలానంద్​ను పోలీస్ స్టేషన్​కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న వస్త్రవ్యాపారులు లీలానంద్‌కు మద్దతుగా పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఆయనపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details