ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. విధుల నుంచి తొలగించిన 20 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని నిరసన తెలిపారు. వీరికి తెదేపా ఇంఛార్జీ కందుల నారాయణరెడ్డి, మాజీ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. ఇన్ని రోజులు కష్టపడ్డ కార్మికులను తీసేసి కొత్తవారిని తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వం మారడం తమకు శాపంగా మారిందన్నారు. ఒక్కొక్కరి దగ్గర రూ.2 లక్షలు లంచం తీసుకుని కొత్త వారిని చేర్చుకుంటున్నారని ఆరోపించారు.
మార్కాపురంలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
ప్రకాశం జిల్లా మార్కాపురంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు. వీరికి తెదేపా ఇంచార్జీ కందుల నారాయణరెడ్డి, మాజీ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. ఉన్న కార్మికులను తీసేసి కొత్త వారిని విధుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
మార్కాపురంలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా