రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. గతంలో కంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందని అన్నారు. బుధవారం ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతల విషయంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు, లేఖలు వస్తున్నాయి కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎవరైనా లేఖ రాయడంలో తప్పులేదు. అందులో వాస్తవాలు, ఆధారాలతో రాస్తే స్వీకరిస్తాం. కానీ సంఘటన జరిగింది ఒకటైతే.. వ్యాప్తి ఇంకొకటి జరుగుతోంది. కేసు దర్యాప్తు జరుగుతుంటే ఏదేదో చెబితే ఎలా. దేవాలయాల్లో జరుగుతున్నవి దొంగతనాలే... దాడులు కావు. ప్రతిపక్షం రాసిన లేఖలో పేర్కొన్న ఆరోపణలు నిజం కాదు. ఏదైనా చట్టం గురించి ఆరోపణలు వచ్చినప్పుడు పోలీసులుగా దానిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే నేను ప్రతిలేఖ రాశాను. కాని ఇందులో రాజకీయం ఉందని విమర్శలు చేశారు- గౌతమ్ సవాంగ్, డీజీపీ
హోంగార్డుల సంక్షేమానికి కృషి..