ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాండ్రపేటలో నిప్పుల గుండం తొక్కిన భక్తులు - prakasham district newsupdates

ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేటలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం వైభవంగా నిర్వహించారు. నిప్పుల గుండం తొక్కితే సకల పాపాలు తొలగిపోతాయని.. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు.

Devotees on fire in Jandrapet
జాండ్రపేటలో నిప్పుల గుండం తొక్కిన భక్తులు

By

Published : Feb 11, 2021, 11:33 AM IST

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేటలో వైభవంగా నిర్వహించారు. భక్తులు నిప్పుల గుండం తొక్కారు. అమ్మవారి నగరోత్సవం కన్నులపండువగా సాగింది. అనంతరం మహిళలు కుంకుమపూజ నిర్వహించారు.

నిప్పుల గుండం తొక్కితే సకల పాపాలు తొలగిపోతాయని.. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసం.. జై వాసవీ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. 22 మంది అమ్మవారి దీక్ష తీసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షకార్యదర్శులు మల్లిఖార్జున రావు, సుధాకర్ రావు , పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఉద్ధృతంగా విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం

ABOUT THE AUTHOR

...view details