ప్రకాశం జిల్లా మార్కాపురం శివారు అల్లూరి పోలేరమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉగాది పర్వదినానికి నాలుగు వారాల ముందు నుంచి ఇక్కడి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. మొక్కులు ఉన్న భక్తులు ఎడ్లబండ్లను, ప్రభలను డప్పుల వాయిద్యాలతో ఊరేగించి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు.
అల్లూరి పోలేరమ్మ దర్శనానికి బారులు తీరిన భక్తులు - temples in markapuram
ప్రకాశం జిల్లాలోని మార్కాపురం అల్లూరి పోలేరమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఎడ్లబండ్లు, ప్రభలను ఊరేగిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీ అల్లూరి పోలేరమ్మ దర్శనానికి బారులు తీరిన భక్తులు