ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామిని ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు పరామర్శించారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతలోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లి పలకరించారు. ఇటీవల చినజీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు గుండెపోటుతో పరమపదించారు. ఈ క్రమంలో ఆయనను పరామర్శించారు. వారితో పాటు కొత్తగూడెంకు చెందిన ప్రముఖ రాజకీయ నేత కోనేరు సత్యనారాయణ, పర్చూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు బండారుపల్లి రామచంద్రంబాబు తదితరులు ఉన్నారు.
చినజీయర్ స్వామికి దేవినేని ఉమ, తెదేపా నేతల పరామర్శ - చినజీయర్ స్వామిని పరామర్శించిన దేవినేని ఉమ
త్రిదండి చినజీయర్ స్వామిని మాజీ మంత్రి దేవినేని ఉమ, తెదేపా నేతలు పరామర్శించారు. హైదరాబాద్లోని ముచ్చింతలో ఆయన ఆశ్రమానికి వెళ్లి పలకరించారు. ఇటీవల చినజీయర్ స్వామి వారి తల్లి పరమపదించారు. ఈ క్రమంలో తెదేపా నేతలు ఆయనను పరామర్శించారు.
![చినజీయర్ స్వామికి దేవినేని ఉమ, తెదేపా నేతల పరామర్శ devineni uma tdp leders visit chinajeeyar swamy ashram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8880457-291-8880457-1600678400334.jpg)
చినజీయర్ స్వామికి దేవినేని ఉమ, తెదేపా నేతల పరామర్శ