ప్రకాశం జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. మూడు రోజులుగా జడ్పీ కార్యాలయంలో జడ్పీ అభ్యర్థులు, ఎంపీడీవో కార్యాలయాల్లో ఎంపీటీసీ అభ్యర్థులు నామ పత్రాలు దాఖలు చేశారు. మొదటి రెండు రోజులు ప్రక్రియ మందకొడిగానే సాగినా... చివరి రోజైన బుధవారం జడ్పీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు వారి అనుచరులు పెద్ద ఎత్తున తరలిరావటంతో జడ్పీ పరిసరాలు సందడిగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 55 జడ్పీటీసీ స్థానాలతో పాటు 54 మండలాల పరిధిలో 742 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా జడ్పీటీసీ స్థానాలకు 20.....ఎంపీటీసీ స్థానాలకు 142 మంది నామినేషన్లు వేశారు. మొత్తంగా మూడు రోజుల్లో ఎంపీటీసీ స్థానాలకు 4,115.... జడ్పీటీసీలకు 394 నామినేషన్లు దాఖలయ్యాయి.
ప్రకాశం: ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు భారీగా నామినేషన్లు
రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రకాశం జిల్లాలో చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు రోజుల్లో ఎంపీటీసీ స్థానాలకు 4,115.... జడ్పీటీసీలకు 394 నామినేషన్లు దాఖలయ్యాయి.
details of nominations filed in Prakasam district
ఎంపీటీసీలకు అత్యధికంగా టంగుటూరు మండలంలో 14, యర్రగొండపాలెంలో 133 దాఖలయ్యాయి. జడ్పీటీసీలకు సంబంధించి వైకాపా అభ్యర్థులు 180 మంది, తెదేపా తరఫున 100 మంది నామపత్రాలు సమర్పించారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఏడు మండల కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది. షెడ్యూల్ ప్రకారం గురువారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరగనుంది.
ఇదీ చదవండి:తెదేపాకు బల'రామ్ రామ్'!.. ఒకటి రెండు రోజుల్లో స్పష్టత