లాక్డౌన్తో ప్రకాశం జిల్లాలోని సముద్ర తీరప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. చీరాల, వాడరేవు, రామాపురం బీచ్లు జనాలతో కిటకిటలాడుతుంటాయి. కానీ ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనతో ఈ ప్రాంతాలన్నీ కళతప్పాయి. దీనికితోడు సముద్రంలో చేపలు గుడ్లుపెట్టేకాలం కావటంతో రెండు నెలలపాటు ప్రభుత్వం వేటపై నిషేధం విధించింది. ఫలితంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లడం లేదు.
నిర్మానుష్యంగా మారిన సముద్రతీరాలు - ప్రకాశం జిల్లా వార్తలు
నిత్యం సందర్శకులతో కిటకిటలాడే ప్రకాశం జిల్లాలోని సముద్ర తీరం లాక్డౌన్తో నిర్మానుష్యంగా మారింది. దీనికి తోడు చేపల వైటపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఫలితంగా సముద్ర తీర ప్రాంతాలు నిశ్శబ్దంగా మారాయి.
![నిర్మానుష్యంగా మారిన సముద్రతీరాలు Destructive beaches in prakasam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6950675-548-6950675-1587912092054.jpg)
నిర్మానుష్యంగా చీరాల సముద్రతీరం