ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెలిగొండ ప్రాజెక్టుకు సేవలందించిన టన్నెల్‌ బోరింగు మిషన్‌ ధ్వంసం

వెలిగొండ ప్రాజెక్టు కోసం పుష్కరకాలం విశేష సేవలందించిన టన్నెల్‌ బోరింగు మిషన్‌ ధ్వంసం చేశారు. ప్రాజెక్టు మొదటి టన్నెల్​ నిర్మాణానికి ఈ యంత్రమే ఆధారమైంది.

Destruction of tunnel boring machine
టన్నెల్‌ బోరింగు మిషన్‌ ధ్వంసం

By

Published : Feb 16, 2021, 7:37 AM IST

రాష్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల నేల తల్లిని సస్యశ్యామలం చేసే వెలిగొండ ప్రాజెక్టుకు ఆకృతిని తీసుకొచ్చేందుకు సహకరించిన టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ తన కర్తవ్యాన్ని పూర్తి చేసింది. నిరంతరంగా పుష్కర కాలంపాటు విశిష్ట సేవలందించిన ఈ యంత్రాన్ని తిరిగి వెనక్కి తెచ్చే అవకాశం లేక చివరకు ధ్వంసం చేయాల్సి వచ్చింది. గంగమ్మకు దారి చూపేందుకు వచ్చిన ఈ యంత్రాన్ని స్థానికులు అపురూపంగా చూశారు. యంత్రంలో ఉన్న సాంకేతిక పరికరాలను చూసి అబ్బురపడ్డారు. టన్నెల్‌ నిర్మాణానికి బోరింగ్‌ మిషన్‌ తప్పక అవసరమని నిర్ణయించి రూ.128 కోట్లు వెచ్చించి జర్మనీ నుంచి 2008లో తెప్పించారు. ఈ యంత్రం కొండను తొలుస్తూ ముందుకెళ్లడమే తప్ప వెనక్కు తెచ్చే వీలులేదు. మొదటి టన్నెల్‌ను నిర్మించడంతో యంత్రాన్ని ఈ మధ్యే 99శాతం ధ్వంసం చేసి విడిభాగాలను తుక్కుగా బయటకు తెచ్చారు.

ABOUT THE AUTHOR

...view details