ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని అటవీ ప్రాంతంలో నాటు సారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని చెన్నారాయునిపల్లి అటవీ ప్రాంతంలో నాటు సారా తయారు చేయడానికి... సిద్ధంగా ఉంచిన 1200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. త్రిపురంతాకం, పుల్లలచెరువు, యర్రగొండపాలెం మండలాలతో పాటు.. ఎక్కడైనా నాటుసారా తయారీ అమ్మకాలు చేస్తే... తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు.
1200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - యర్రగొండపాలెంలో నాటుసారా ధ్వంసం
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. 1200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
![1200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం Destroyed 1200 liters of herb jaggery at prakasham district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9234910-292-9234910-1603118589816.jpg)
1200 లీటర్ల నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం