గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ ఏదైనా ఆరోగ్య సేవలు పొందలాన్నా.. అయా ప్రాంతాల్లోనే మెరుగైన వైద్యం అందేలా చేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం ఐనముక్కలలోని ఐటీడీఏ పరిధిలోని దాదాపు రూ.50 కోట్ల నిధులతో నిర్మించతలపెట్టిన గిరిజన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని మంత్రులు అదిమూలపు సురేశ్, బాలినేని శ్రీనివాస్ రెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని - alla nani latest news
ప్రకాశం జిల్లాలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని పర్యటించారు. పెద్ద దోర్నాల మండలం ఐనముక్కలలోని ఐటీడీఏ పరిధిలో నిర్మించబోయే ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించిన విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని