ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిపో మేనేజర్ వేధిపులు తాళలేక డ్రైవర్ ఆత్మహత్యాయత్నం - డిపో మేనేజర్ వేధిపులు తాళలేక డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ వేధింపులు తట్టుకొలేక డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. అదనంగా డ్యూటీలు వేస్తున్నారని.. విధులు సంక్రమంగా నిర్వహించినా ఏదో సాకుతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని.. బాధితుడు వాపోయాడు.

Depot manager harassment driver commits suicide
డిపో మేనేజర్ వేధిపులు తాళలేక డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

By

Published : Mar 23, 2021, 1:54 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ వేధింపులు తాళలేక డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. డిపోలో 2007 నుంచి పని చేస్తున్న డ్రైవర్​ ఎస్.​కె. కరిముల్లా.. డిపో మేనేజర్ ఆగడాలను తట్టుకోలేక అసిస్టెంట్ మేనేజర్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గుర్తించిన తోటి ఉద్యోగులు స్పందించి బాదితుడిపై నీళ్లు చల్లారు.

డిపో మేనేజర్ మానసికంగా వేధిస్తున్నారని.. అదనంగా డ్యూటీలు వేస్తున్నారని విధులు సక్రమంగా నిర్వహించినా.. ఏదో సాకుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పాడు. అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కరీముల్లా తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details