సంక్రాంతి సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల చిరుతిండ్లకు గిరాకీ మరింత పెరిగింది. చీరాలలోని కోట్ల బజార్ రామాలయం ప్రాంతంలోని హోమ్ ఫుడ్స్‌లో తయారయ్యే అరిసెలు, కజ్జికాయలు, సున్నుండలు, చక్కిలాలు, జంతికలకు మంచి పేరు ఉంది. ఇక్కడ తయారయ్యే పిండి వంటలు.. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా సహా మరికొన్ని దేశాలకు సరఫరా చేస్తున్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకపోవడం వల్లే తమ పిండి వంటలకు మంచి గిరాకీ ఉందని హోమ్ ఫుడ్స్ నిర్వాహకులు చెబుతున్నారు. కచ్చితంగా రోటిలో కొట్టిన బియ్యాన్నే అరిసెల తయారీకి ఉపయోగిస్తున్నారు.
నాణ్యతలో లేదు రాజీ... చీరాల పిండివంటలకు మంచి గిరాకీ - prakasam district latest news
సంక్రాంతి పండుగ రోజుల్లో నోరు తీపి చేసుకోని తెలుగువారు ఉండరు. అరిసెలు, చక్రాలు వంటి పిండివంటలను కొంతమంది స్వయంగా చేసుకుంటుండగా... మరికొందరు మార్కెట్లో కొంటున్నారు. ఈ క్రమంలో సంప్రదాయ పిండివంటల తయారీ కొంతమందికి ఆదాయ వనరుగా మారుతోంది. చీరాలలోని ఓ కుటుంబం తయారు చేసే స్వీట్లు విదేశాలకూ ఎగుమవుతున్నాయి.
![నాణ్యతలో లేదు రాజీ... చీరాల పిండివంటలకు మంచి గిరాకీ chirala sweets](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10226887-720-10226887-1610532598110.jpg)
chirala sweets