కిరణ్ కుమార్ మృతికి కారకుల్తెన పోలీసులను అరెస్ట్ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాలలో యువకులు, ప్రజా సంఘాలు పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి, పట్టణ ప్రధాన వీధులో ర్యాలీ చేశారు. అనంతరం ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కిరణ్ కుమార్ ను పోలీసులే కోట్టి చంపారని, ఘటనకు కారణమైన ఎస్సై విజయ్ కుమార్ తో పాటు కానిస్టేబుళ్ళను కూడా అరెస్ట్ చేసి హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కిరణ్ కుమార్ మృతిపై సిబిఐ విచారణకు డిమాండ్ - Demand for CBI probe into death of young man Kiran Kumar
కిరణ్ కుమార్ మృతికి కారకుల్తెన పోలీసులను అరెస్ట్ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాలలో యువకులు, ప్రజా సంఘాలు పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు
![కిరణ్ కుమార్ మృతిపై సిబిఐ విచారణకు డిమాండ్ Demand for CBI probe into death of young man Kiran Kumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8216661-1019-8216661-1596027990447.jpg)
కిరణ్ కుమార్ మృతిపై సిబిఐ విచారణకు డిమాండ్
ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి కిరణ్ మృతిపై సిబిఐ విచారణ చేయాలని కోరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి : కరోనాతో ఇద్దరు మృతి..అప్రమత్తమైన అధికారులు