ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అడవి నుంచి పంట పొలాల్లోకి వచ్చి జింక.. కుక్కల దాడిలో మృతి - today Deer died in a dog attack latest news

ప్రకాశం జిల్లా తాళ్లురు మండలం విఠలాపురం గ్రామ ఎస్సీ కాలనీకి దగ్గరలో ఉన్న పొలాల్లోకి వచ్చిన జింక.. కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయింది. జింకను కుక్కలు వేటాడుతుండగా.. చూసిన గ్రామస్థులు కుక్కలను తరిమి కొట్టారు. అప్పటికే జింక మృతి చెందింది.

కుక్కల దాడిలో మృతి చెందిన జింక
కుక్కల దాడిలో మృతి చెందిన జింక

By

Published : May 17, 2021, 8:00 PM IST

Updated : May 17, 2021, 9:27 PM IST


అడవిలో తిరగాల్సిన వన్యప్రాణి దారి తప్పి.. పొలాల్లోకి వచ్చి.. శునకాల దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామ ఎస్సీ కాలనీకి దగ్గరలో ఉన్న పొలాల్లో.. కుక్కల దాడి చేశాయి. స్థానిక ప్రజలు గమనించి కుక్కలను తరిమికొట్టారు. అప్పటికే జింక మృతి చెందింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి జింకను పరిశీలించారు. పశువైద్యాధికారి సమక్షంలో పంచనామా నిర్వహించి.. అక్కడే ఖననం చేయాలని అదేశించటంతో కింది స్థాయి సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

Last Updated : May 17, 2021, 9:27 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details