ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్త చేసిన అప్పులకు భార్య బలి - praksam district

భర్త బాధ్యతలు మరిచి, అప్పులు చేసి తిరుగుతున్నా కుటుంబాన్ని ఆమె నెట్టుకోస్తోంది. అయితే అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేయటంతో మనస్థాపానికి గురైంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

praksam district
ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య

By

Published : Jun 25, 2020, 12:07 AM IST

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో అప్పుల బాధతో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన సౌజన్య, లింగయ్య దంపతులు. లింగయ్య తెనాలి సమీపంలోని సంగంజాగర్లమూడిలోని ఓ శీతలపానియం సంస్థలో డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. సౌజన్య కొత్తపేటలో ఇంటి వద్ద బ్యూటీ పార్లర్ నడుపుతుంది. లింగయ్య అప్పుడప్పుడు ఇంటికి వచ్చిపోతుంటాడు. భార్యా పిల్లలను సరిగ్గా పట్టించుకోకుండా, అప్పులు కూడా చేశాడు. ఈ క్రమంలో అప్పులవాళ్లు ఇంటికొచ్చి సౌజన్యను డబ్బుల కోసం ఒత్తిడిచేయసాగారు. వారి మనస్తాపానికి గురైన ఆమె ఉరివేసుకుని బుధవారం బలన్మరణానికి పాల్పడింది. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. చీరాల రెండోపట్టణ సీఐ ఫిరోజ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

ABOUT THE AUTHOR

...view details