రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు అద్దంకి బ్రాంచ్ కాలువలో జారిపడి గల్లంతైన బీటెక్ విద్యార్థి.. సంతమాగులూరు మండలం అడవి పాలెం పవర్ ప్లాంట్ వద్ద శవమై తేలాడు. మండలంలోని కామేపల్లి గ్రామానికి చెందిన మోదేపల్లి దినేష్ కుమార్ గుంటూరు జిల్లా నరసరావుపేటలో ద్వితీయ సంవత్సరం బీటెక్ చదువుతున్నాడు. ప్రకాశం గుంటూరు జిల్లా సరిహద్దులోని గంటవారి పాలెం అద్దంకి బ్రాంచి కాలువ వంతెన సమీపంలో మిరప చేనుకు పురుగు మందు కొట్టేందుకు సహాయంగా వెళ్లాడు. పిచికారీ అనంతరం పని ముగించి సాయంత్రం తిరిగి వచ్చే సమయంలో చేతులు శుభ్రం చేసుకుటుండగా.. ప్రమాదశావత్తు నీటిలో పడి గల్లంతయ్యాయాడు. ప్రాణాలతో తిరిగి వస్తాడనుకున్న కుమారుడు రెండు రోజుల తర్వాత శవంగా మారడంతో దినేష్ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.
కాలువలో బీటెక్ విద్యార్థి గల్లంతు.. రెండు రోజుల తర్వాత మృతదేహం లభ్యం
ప్రమాదవశాత్తు అద్దంకి బ్రాంచ్ కాలువలో జారిపడి గల్లంతైన బీటెక్ విద్యార్థి.. సంతమాగులూరు మండలం అడవి పాలెం పవర్ ప్లాంట్ వద్ద శవమై తేలాడు. రెండు రోజుల క్రితం ప్రకాశం - గుంటూరు జిల్లా సరిహద్దులోని గంటవారి పాలెం అద్దంకి బ్రాంచి కాలువ వంతెన సమీపంలో మిరప చేనుకు పురుగు మందు కొట్టేందుకు సహాయంగా వెళ్లిన అతను కాలువలో పడి గల్లంతయ్యాడు.
కాలువలో పడిన బీటెక్ విద్యార్థి