ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యపాన నిషేధానికి వ్యసన విముక్తి కేంద్రాలు - ఏపీలో వ్యసన విముక్తి కేంద్రాలు

మద్యపాన నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు. ఇందుకోసం ఒంగోలులో వ్యసన విముక్తి కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యసన విముక్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

de addiction center
de addiction center

By

Published : May 27, 2020, 8:56 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో వ్యసన విముక్తి కేంద్రాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రిమ్స్‌ ఆసుపత్రి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రం సేవలు నిరంతరంగా ఉంటాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉంటుందని, దశల వారీగా దీన్ని అమలు చేస్తున్నందున వ్యసన పరులు ఇబ్బంది పడకుండా చూస్తామన్నారు. వారిలో మానసిక మార్పులు తీసుకువచ్చేందుకు, కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రతీ జిల్లాలో వ్యసన విముక్తి కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details