రాష్ట్రంలో కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది పేదలు, కార్మికులు, కూలి పనివారు ఉపాధి కోల్పోయారు. వారందరినీ ప్రభుత్వం ఆదుకొని...రూ.5000 ఆర్థిక సాయమందించాలని దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. తక్షణమే అన్న క్యాంటీన్లను తెరచి పేదలకు అందరికి 5 రూపాయలకు భోజనం పెట్టాలని అన్నారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.
'ఉపాధి కోల్పోయిన వారికి రూ.5 వేలు ఇవ్వాలి' - ఏపీ లాక్‌డౌన్ ఎఫెక్ట్
లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు నిరాహారదీక్ష చేపట్టారు.
దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు నిరాహారదీక్ష