ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెం గ్రామాన్ని దర్శి డీఎస్పీ ప్రకాష్ రావు సందర్శించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దిల్లీ నుంచి ఇటీవల ఒంగోలుకు వచ్చాడు. అతనికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. ఈ విషయంపై డీఎస్పీ అతని కుటుంబీకులతో మాట్లాడారు. ఆ వ్యక్తి గురించి ఆరా తీశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని డీఎస్పీ సూచించారు.
'ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు కరోనా పరీక్షలు చేయించుకొండి' - news on corona patients in prakasam
దిల్లీ నుంచి ఒంగోలుకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం వల్ల దర్శి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో డీఎస్పీ పర్యటించి కరోనా పట్ల అవగాహన కల్పించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
కరోనాపై అవగాహన కల్పిస్తోన్న దర్శి పోలీసులు