దర్శి తహశీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ.. ప్రకాశం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు - ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల ఇచ్చిన కేసులో దర్శి ఎమ్మార్వో సస్పెండ్
21:59 February 24
ప్రకాశం జిల్లా దర్శి తహశీల్దార్ వరకుమార్‌పై సస్పెన్షన్ వేటు
Darshi Tahsildar Suspended: ప్రకాశం జిల్లా దర్శి తహశీల్దార్ వరకుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేసినట్లు తేలడంతో సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం, అక్రమంగా పాసు పుస్తకాలు జారీ చేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో విచారణకు ఆదేశించారు. మండల పరిధిలోని పొట్లపాడులో 81 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇతరులకు కట్టబెట్టినట్లు తేలిందని కలెక్టర్ వెల్లడించారు. వరకుమార్.. గతేడాది కురిచేడు తహశీల్దార్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు.
ఇదీ చదవండి:JEE advanced exam schedule: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూల్ విడుదల