ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 17, 2022, 10:32 AM IST

ETV Bharat / state

దర్శి సామాజిక వైద్యశాలలో నగదు గోల్‌మాల్​... ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకుండా..

Employees savings Funds: దర్శి సామాజిక వైద్యశాల ప్రభుత్వ ఉద్యోగుల పొదుపు ఖాతాల్లో నగదు గోల్‌మాలైంది. 2018 నుంచి ఇప్పటివరకు పొదుపు ఖాతాల్లో నిధులు జమ కాలేదు. పొదుపు ఖాతా నుంచి రుణం కోసం ఓ ఉద్యోగి దరఖాస్తు చేసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే...

Darshi community hospital
Darshi community hospital

Employees savings Funds: ప్రకాశం జిల్లా దర్శి సామాజిక వైద్యశాలలో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పొదుపు ఖాతాల్లో జమ కావలసిన నిధులు... గోల్ మాల్ అయినట్లు తెలుస్తోంది. ప్రతినెలా ఉద్యోగుల పొదుపు ఖాతాలోకి కొంత నిధులు జమ కావాల్సి ఉండగా.. ఆ నిధులు జమ కాలేదని బయటపడింది. వైద్యశాలలో జీతభత్యాలు, జమా ఖర్చులు చూసే ఓ వ్యక్తి.. నిధులను తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నట్లు బాధితులు అనుమానిస్తున్నారు.

ఎలా తెలిసిందంటే...

Employees savings Funds: ఇటీవల ఓ ఉద్యోగి రుణం కోసం దరఖాస్తు చేసుకోగా... తన పొదుపు ఖాతాలో నగదు లేదని తేలింది. ఉద్యోగి సంబంధిత వ్యక్తిని ప్రశ్నించగా అసలు విషయం బయటకు వచ్చింది. నాలుగేళ్లనుంచి 34 మంది ఉద్యోగస్థుల పొదుపు ఖాతాల్లో జమ కావలసిన మొత్తం నగదు... సుమారు రూ.35 నుంచి రూ.40 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అధికారులు అంటున్నారు.

ఇదీ చదవండి:

అక్రమంగా భూమి కాజేశారు.. తప్పించుకోడానికి సినిమా ప్లాన్ వేశారు !

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details