నివర్ తుపాను శాంతించినా ఏక ధాటిగా కురిసిన వర్షాలకు వాగులు పొంగుతునే ఉన్నాయి. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం గన్నవరం గ్రామ సమీపంలో ఉన్న పాలేటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళ చెందుతున్నారు. వాగుకు అవతలి వైపు ఉన్న గన్నవరం, చెన్నంపల్లి, గండ్లోపల్లి, నాగులవరం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపొయాయి. స్థానిక పోలీసులు వాగుకు రెండు వైపులా రోడ్డుకు కంప అడ్డంగా వేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వర్షం తగ్గిన ఉద్దృతంగా పాలేటి వాగు... - nivar cyclone
నివర్ తుపాన్ ప్రభావం కారణంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు, జలాశయాలు పొంగిపొర్లాయి. వానలు తగ్గినా ఇప్పటికి ప్రకాశం జిల్లా గన్నవరం గ్రామ సమీపంలో పాలేటి వాగు ఉద్ధృతంగానే ప్రవహిస్తోంది. ప్రజలు రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
వర్షం తగ్గిన ఉద్దృతంగా ప్రవాహిస్తోన్న పాలేటి వాగు... ఆందోళనలో గ్రామస్తులు