ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల పట్టాల పంపిణీలో రికార్డింగ్​ డ్యాన్సులు.. ! - prakasam district news

ప్రకాశం జిల్లా పామూరు మండలం గుమ్మలంపాడు గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి బాలినేని శ్రీనివాస్​రెడ్డి హాజరయ్యారు. అయితే కొందరు పార్టీ నాయకులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయగా.. అవి కాస్త శ్రుతిమించి రికార్డింగ్ డ్యాన్సుల స్థాయిని తలపించటంతో.. విమర్శలకు దారితీసింది.

dances were performed in house sites distribution programme in prakasam district
మంత్రి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు.. రికార్డింగ్ డ్యాన్సులపై విమర్శలు

By

Published : Jan 6, 2021, 7:44 PM IST

ప్రకాశం జిల్లా పామూరు మండలం గుమ్మలంపాడు గ్రామంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు శ్రుతి మించి రికార్డింగ్​ డాన్సుల స్థాయిని తలపించాయి.. ఫలితంగా వైకాపా నాయకులపై విమర్శలు వెల్లువెత్తాయి. గుమ్మలంపాడు గ్రామంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రాంతాల నుంచి డ్యాన్సర్లను పిలిపించి.. ఆటా పాటలతో కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి స్వయంగా పాల్గొన్న ప్రభుత్వ కార్యక్రమంలో ఇలాంటి డ్యాన్సులు నిర్వహించటంపై పలువురు విమర్శిస్తున్నారు.

మంత్రి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు.. రికార్డింగ్ డ్యాన్సులపై విమర్శలు
ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details